దిశ దినకర్మ రోజున విచారణ పేరుతో ఇబ్బంది పెట్టొద్దన్న తల్లిదండ్రులు!

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • ఎన్ హెచ్ఆర్సీ దర్యాప్తు
  • దిశ తల్లిదండ్రుల స్టేట్ మెంట్ తీసుకోవాలని నిర్ణయం
దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ ను సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) దిశ తల్లిదండ్రుల నుంచి స్టేట్ మెంట్ తీసుకోవాలని భావించింది. అందుకోసం తాము బస చేసిన పోలీస్ అకాడమీకి దిశ తల్లిదండ్రులను తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది.

దాంతో శంషాబాద్ లోని నక్షత్ర అపార్ట్ మెంట్ కు వెళ్లిన పోలీసులకు అక్కడ దిశ తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దిశ దినకర్మ రోజున విచారణ పేరుతో తమను ఇబ్బందిపెట్టవద్దని వారు పోలీసులను కోరారు. అంతేగాకుండా, దిశ తల్లి ఆరోగ్యం సరిగాలేదని ఎన్ హెచ్ఆర్సీకి తెలియజేశారు.
Go Back to Shorts
Disha
Police
NHRC
Telangana
Hyderabad

More Telugu News